ఆఫ్రికన్ దేశం మొరాకోలో శుక్రవారం (సెప్టెంబర్ 8) రాత్రి సంభవించిన భారీ భూకంపంలో భారీ ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. భూకంపం కారణంగా రెండు వేల మందికి పైగా చనిపోయినట్లు నిర్ధారించారు. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. వేలాది మంది గాయపడ్డారు. భూకంపం మర్రకేష్ నగరంలో ఉన్న యునెస్కో రక్షిత ప్రపంచ వారసత్వ స్మారక చిహ్నానికి కూడా నష్టం కలిగించింది. 1960 తర్వాత ఈ ప్రాంతంలో సంభవించిన అత్యంత విధ్వంసకర భూకంపం ఇదే. మొరాకో అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రకారం, భూకంపం నుండి మరణించిన వారి సంఖ్య 2012, గాయపడిన వారి సంఖ్య 2059, వీరిలో 1,404మంది పరిస్థితి విషమంగా ఉందని ఆ దేశ మంత్రిత్వశాఖ తెలిపింది.
పూర్తిగా చదవండి..Morocco Earthquake: 2 వేలు దాటిన మొరాకో భూకంపం మృతుల సంఖ్య, ఎటు చూసిన శవాల దిబ్బలే..!!
ఆఫ్రికా దేశం మొరాకో భారీ భూకంపంతో చిగురాకులా వణికిపోయింది. శుక్రవారం అర్థరాత్రి సంభవించిన భారీ భూకంపం ఘటనలో ఇప్పటివరకు రెండువేలకుపై మంది ప్రాణాలు కోల్పోయారు. 2,059మంది గాయపడ్డారు. వీరిలో 1,404మంది పరిస్థితి విషమంగా ఉందని ఆ దేశ మంత్రిత్వశాఖ తెలిపింది.

Translate this News:











