విద్యార్థుల సమస్యలు తీర్చాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ విద్యార్థి సంఘ నేతలు సిద్దిపేటలోని మంత్రి హరీష్ రావు క్యాంపు కార్యాలయం ముట్టడికి యత్నించారు. హరీష్ రావు కార్యాలయానికి ఏబీవీపీ కార్యకర్తలు భారీగా వస్తుండటాన్ని గమనించిన పోలీసులు ఆందోళన కారులను అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఏబీవీపీ నేతలను బలవంతంగా అరెస్ట్ చేసిన పోలీసులు.. వారిని బెజ్జం పోలీస్ స్టేషన్కు తరలించారు. కాగా రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఏబీవీపీ నాయకుడు వివేక్.. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులను మోసం చేస్తోందని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ విద్యార్థుల సమస్యలను నిర్వీర్యం చేస్తూ వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని విమర్శించారు.
పూర్తిగా చదవండి..సిద్ధిపేటతో ఉద్రిక్తత.. హరీష్ రావు కార్యాలయం ముట్టడికి ఏబీవీపీ యత్నం
మంత్రి హరీష్ రావు క్యాంపు కార్యాలయ ముట్టడికి ఏబీవీపీ నేతలు యత్నంచారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తోందని ఆరోపించారు.

Translate this News:











