తెలంగాణ సెక్రటేరియట్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, హస్టల్ల్లోకి మీడియాను, విద్యార్థి సంఘాలను రానివ్వకుండా ప్రభుత్వం ఆక్షలు విధించింది. దీనికి నిరసనగా ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాలు సచివాలయం ముట్టడికి ప్రయత్నించాయి. విద్యార్థులు పెద్ద సంఖ్యలో వస్తుండటాన్ని గమనించిన పోలీసులు విద్యార్థి సంఘాల నాయకులను అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రోడ్డుపై బైటాయించిన విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం పోలీసులు విద్యార్థి సంఘాల నేతలను అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. మరోవైపు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఏఐఎస్ఎఫ్ నేతలు.. ప్రభుత్వం మీడియా హక్కులను కాలరాస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ విద్యాలయాల్లోకి విద్యార్థి సంఘాలను, మీడియాను ఎందుకు అనుమతిండచంలేదని ప్రశ్నించారు.
పూర్తిగా చదవండి..సెక్రటేరియట్ వద్ద ఉద్రిక్తత
తెలంగాణ సెక్రటేరియట్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సచివాలయ ముట్టడికి ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల నేతలు యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రోడ్డుపై బైటాయించిన విద్యార్థి సంఘ నాయకులను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు.

Translate this News:











