కేంద్ర ప్రభుత్వం మరో కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా 169 నగరాల్లో 10 వేల ఎలక్ట్రిక్ బస్సుల్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. పీఎం ఈ-బస్ సేవ పథకంలో భాగంగా ముందుగా 3 వేల ఎలక్ట్రిక్ బస్సుల్ని సేకరించేందుకు చర్యలు చేపడుతోంది. అయితే దీనికోసం వచ్చే వారంలోనే టెండర్లకు ఆహ్వానించే అవకాశాలు ఉన్నట్లు కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి మనోజ్ జోషీ తెలిపారు. ఇక పీఎం ఈ-బస్ సేవా పథకం కింద.. పబ్లిక్ – ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో 169 నగరాలకు 10 వేల బస్సులు తీసుకురావాలని కేంద్ర కేబినెట్ ఆగస్టులో నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా దీని గురించి ప్రస్తావించిన మనోజ్ జోషీ.. ఇందులో రాష్ట్రాలు కూడా భాగస్వాములుగా ఉంటాయని పేర్కొన్నారు.
పూర్తిగా చదవండి..Electric Bus: దేశంలో 10 వేల కొత్త ఎలక్ట్రిక్ బస్సులు.. వచ్చేవారమే టెండర్లు
దేశంలో 169 నగరాల్లో 10 వేల ఎలక్ట్రిక్ బస్సులను కేంద్ర ప్రభుత్వం తీసుకురానుంది. ఇందుకోసం వచ్చేవారమే టెండర్లు ఆహ్వానించే ఛాన్స్ ఉంది. ముందుగా 3వేల ఈ-బస్లు అందుబాటులోకి తీసుకురానున్నారు. 3 లక్షల నుంచి 40 లక్షల మధ్య జనాభా ఉన్న నగరాలకే ఈ సేవలు వర్తించనున్నాయి.

Translate this News:











