ఏపీ స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు(Chandrababu) అరెస్ట్ అవ్వడం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవగా రెండు తెలుగు రాష్ట్రాల్లో టాక్ ఆఫ్ ది టూ స్టెట్స్గా మారింది. చంద్రబాబు చుట్టూ తెలుగు రాష్ట్రాల రాజకీయాలు తిరుగుతున్నాయి. చంద్రబాబు అరెస్ట్‌తో తెలంగాణకు ఏం సంబంధం లేదని బీఆర్ఎస్ పెద్దలు పైకి చెప్పుకుంటున్నా.. మరికొంతమంది మంత్రులు మాత్రం ఈ మేటర్‌లో ఇన్వాల్వ్ అవుతున్నారు. ముఖ్యంగా చంద్రబాబుకు గతంలో క్లోజ్‌గా ఉన్న ప్రస్తుత బీఆర్ఎస్ మంత్రులు ఇప్పుడు బహిరంగంగా టీడీపీ అధినేతకు సపోర్ట్ చేస్తున్నారు. గతంలో టీడీపీలో ఉండి.. రాష్ట్ర విభజన తర్వాత బీఆర్ఎస్లో చేరిన నేతలు చంద్రబాబుకు సపోర్ట్ ఇస్తున్నారు. కొంతమంది ర్యాలీల్లో కూడా పాల్గొన్నారు. తాజాగా బీఆర్ఎస్ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్(Talasani srinivas yadav) చంద్రబాబుకు సపోర్ట్‌గా ఓ ట్వీట్ పెట్టారు.
పూర్తిగా చదవండి..BRS minister supports CBN: చంద్రబాబుకు మద్దతుగా మరో బీఆర్ఎస్ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. అసలేం జరుగుతోంది?
చంద్రబాబు అరెస్టు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసుపై బీఆర్ఎస్ నేతల స్పందన ఎప్పటికప్పుడూ మారుతూ వస్తోంది. ఏపీ రాజకీయాలతో తమకు పని లేదని కేటీఆర్ వ్యాఖ్యలు చేసిన వారం గడవకముందే మంత్రి హరీశ్‌రావు చంద్రబాబుకు సపోర్ట్‌గా చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. తాజాగా మరో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చంద్రబాబుకు మద్దతుగా ట్వీట్ చేశారు. చంద్రబాబు నాయుడి తీరు పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు విచారకరమన్నారు తలసాని.

Translate this News:











