కలియుగ దైవంగా భక్తులు నమ్మి కొలిచే ఏడుకొండల వాడైన తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కన్నుల పండవగా కొనసాగుతున్నాయి. రేపటి వరకు సాగనున్న ఈ కార్యక్రమంలో పాల్గొనటానికి తెల్లవారు జాము పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం (నేడు) స్వామివారి రథోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఉదయం 6.55 గంటలకు రథోత్సవం ప్రారంభం కానుండగా.. ఈ రథోత్సవంలో స్వామివారు భక్తులను కాటక్షించనున్నారు. తిరుమల మాడ వీధుల్లో సాగనున్న ఈ సేవలో.. స్వామివారి భక్తులు పాల్గొనడానికి ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరారు. మాడవీధుల్లో మలయప్పస్వామి మహారథంపై విహరిస్తూ భక్తులకు కనువిందు చేస్తున్నారు.
పూర్తిగా చదవండి..tirumala: వైభవంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు..నేడు రథోత్సవం
తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు రథోత్సవం నిర్వహిస్తున్నారు. మహారథంపై మాడవీధుల్లో మలయప్పస్వామి విహరిస్తున్నారు. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు అశ్వ వాహనసేవ స్వామి విహరిస్తారు.

Translate this News:











