పాలల్లో పోషకాలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ డీ, కాల్షియం ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఎముకలు, పళ్లను ధృడంగా చేయడానికి ఇవి ఎంతో సహాయపడుతుంది. అందుకే నిత్యం పాలు తాగాలని డాక్టర్లు చెబుతుంటారు. అసలు మన ఆరోగ్యానికి ఏ పాలు మంచివి? అన్నదానిపై చాలా మందికి డౌట్స్ ఉంటాయి. గేదె లేదా ఆవు.. ఏ పాలల్లో ఎక్కువ పోషకాలు ఉంటాయన్న దానిపై సందేహాలు ఉంటాయి. పాలలోని కొవ్వుతోనే వాటి చిక్కదనం ఆధారపడి ఉంటుందంటున్నారు నిపుణులు. ఆవు పాలల్లో మూడు నుంచి నాలుగు శాతమే కొవ్వు ఉంటుంది. గేదె పాలలో 7 నుంచి 8 శాతం వరకు కొవ్వు ఉంటుందని చెబుతున్నారు. కాబట్టి ఆవుపాల కంటే గేదె పాలు చాలా చిక్కగా ఉంటాయి. అంతే కాకుండా అవి అరగడానికి ఎక్కువ సమయం పడుతుంది. అంతే కాదు ఆవు పాలతో పోల్చుకుంటే గేదె పాలలో 10 నుంచి 11 శాతం వరకు ప్రొటీన్ ఎక్కువ ఉంటుంది.
పూర్తిగా చదవండి..Health Tips: గేదె, ఆవు పాలల్లో ఏవి బెటరంటే…!!
ఆవు పాలు, గేదె పాలల్లో ఏది బెటర్ అన్నదానిపై చాలా మందిలో అనేక సందేహాలు ఉంటాయి. ఒక గ్లాస్ గేదె పాలల్లో 237 కేలరీలు ఉంటాయని.. అదే ఆవు పాలల్లో 148 కేలరీలే ఉంటాయని చెబుతున్నారు నిపుణులు. ఆవుపాల కంటే గేదె పాలు చాలా చిక్కగా ఉంటాయంటున్నారు. బాగా నిద్రపట్టాలంటే రాత్రి సమయంలో గేదె పాలు తాగితే బెటర్.

Translate this News:











