భాగ్యనగర్‌లో ఐటీ రంగాన్ని ప్రవేశపెట్టిన ఘనత టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిదేనని సీనియర్ నటుడు, టీడీపీ మాజీ ఎంపీ మురళీ మోహన్ అన్నారు. ఈ రోజు మురళి మోహన్ మాట్లాడుతూ.. చంద్రబాబు అరెస్ట్‌పై సంచనల వ్యాఖ్యాలు చేశారు. “నేను అమెరికా దాటి ఎక్కడ ఆఫీస్ పెట్టలేదు. ఒకవేళ ఇండియాకి వస్తే మొదటిసారి మీ దగ్గరికి వచ్చి ఆఫీస్ పెడతానని” ఆనాడు బిల్ గేట్స్‌తో చంద్రబాబు అన్నారన్నారు. హైదరాబాద్‌కి ఐటీ రంగాన్ని తీసుకువచ్చిన ఘనత చంద్రబాబుదే అన్నారు. మైక్రోసాఫ్ట్ రాగానే ఒకరితో ఒకరు అందరూ లైన్ కట్టి హైదరాబాద్ వచ్చారని మురళి మోహన్ వివరించారు. బిల్ గేట్స్‌ని హైదరాబాద్ హైటెక్ సిటీ ఓపెనింగ్‌కి చంద్రబాబు పిలిచారు. 2000 సంవత్సరంలోనే విజన్ 20-20 అని ప్రారంభించిన మంచి విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు, హైటెక్ సిటీ పెరుగుతుంటే దానికి కావాల్సిన వసతులన్నీ ముందుగానే ఊహించి దానికి తగ్గట్లుగా ఏర్పాట్లు చేసుకున్నారని ఆయన పేర్కొన్నారు.
పూర్తిగా చదవండి..Murali Mohan: త్వరలోనే చంద్రబాబు బయటకు.. మురళి మోహన్ సంచలన ప్రకటన
చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ.. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులతో పాటు నారా కుటుంబం వివిధ కార్యక్రమాలు చేస్తూ నిరసన చేస్తున్న విషయం తెలిసిందే. నేడు గాంధీ జయంతి సందర్భంగా జైల్లో చంద్రబాబు, ఢిల్లీలో లోకేష్, రాజమండ్రిలో భువనేశ్వరి ఒక్క రోజు నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈ సందర్భంగా సీనియర్ నటుడు మురళీ మోహన్ చంద్రబాబు అరెస్ట్‌పై స్పందించారు. హైదరాబాద్‌లో ఐటీ రంగాన్ని ప్రవేశపెట్టిన చంద్రబాబుదేనని అన్నారు.

Translate this News:











