బీజేపీ తెలంగాణ ఎన్నికల శంఖారావం పూరించింది. ఇప్పటికే ఖమ్మంలో రైతు గోస-బీజేపీ భరోసా పేరులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో సభ నిర్వహించగా.. తాజాగా అభ్యర్థుల లిస్టుపై ఫోకస్ చేసింది. ఇప్పటికే అభ్యర్థుల తొలి జాబితాను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అంబర్ పేట నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. కరీంనగర్ నుంచి బండి సంజయ్, హుజురాబాద్ నుంచి ఈటల రాజేందర్, మునుగోడు నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ముషీరాబద్ నుంచి డాక్టర్ లక్ష్మణ్, గద్వాల్ నుంచి డీకే అరుణ, మెదక్ నుంచి విజయశాంతి, సికింద్రాబాద్ నుంచి జయసుధ, దుబ్బాక నుంచి రఘునందన్ రావు, నిర్మల్ నుంచి ఏలేటి మహేశ్వర్ రెడ్డి, నారాయణపేట నుంచి మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఎన్నికల బరిలో దిగనున్నారు.
పూర్తిగా చదవండి..TBJP LIST: అభ్యర్దుల లిస్ట్ సిద్ధం చేసిన టీబీజేపీ.. బరిలో నిలిచేది వీరే..!
బీజేపీ తెలంగాణ ఎన్నికల శంఖారావం పూరించింది. ఇప్పటికే ఖమ్మంలో రైతు గోస-బీజేపీ భరోసా పేరులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో సభ నిర్వహించగా.. తాజాగా అభ్యర్థుల లిస్టుపై ఫోకస్ చేసింది. ఇప్పటికే అభ్యర్థుల తొలి జాబితాను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

Translate this News:











