Telangana TDP: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై తెలుగుదేశం పార్టీ(TDP) కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకుంది. ఈ మేరకు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ప్రకటించారు. అయితే, చంద్రబాబు సూచన మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబుతో తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ శనివారం రాజమండ్రి జైలులో ములాఖత్ అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణపై ఫోకస్ చేయలేమని చంద్రబాబు.. కాసానికి తెలిపారు. ఈ కారణంగానే తెలంగాణ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాల్సి వస్తుందని, ఇందుకు గల కారణాన్ని పార్టీ నేతలకు వివరించాలని కాసానికి సూచించారు చంద్రబాబు. ఈ నిర్ణయం ప్రకారం.. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పోటీ చేయడం లేదని ప్రకటించారు కాసాని.
పూర్తిగా చదవండి..Telangana: ఎన్నికల్లో పోటీ చేయడం లేదు.. టీటీడీపీ అధ్యక్షుడి సంచలన ప్రకటన..
తెలంగాణ ఎన్నికల బరి నుంచి తెలుగుదేశం పార్టీ తప్పుకుంది. తెలంగాణలో టీడీపీ పోటీ చేయడం లేదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ప్రకటించారు. ఇందుకు గల కారణాలను కూడా వెల్లడించారు. పార్టీ శ్రేణులు అర్థం చేసుకోవాలని కోరారు కాసాని. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఏపీపైనే దృష్టి పెట్టింది. దీంతో తెలంగాణపై ఫోకస్ చేయలేని పరిస్థితి నెలకొంది. అందుకే తెలంగాణ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకోవాలని తెలంగాణ నేతలకు చంద్రబాబు సూచించారని తెలుస్తుంది.

Translate this News:











