ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో బీఆర్ఎస్ కు (BRS) గట్టి షాక్ తగిలింది. కల్వకుర్తి నియోజకవర్గంపై గట్టి పట్టు ఉన్న ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి (Kasireddy Narayana Reddy) పార్టీని వీడనున్నట్లు ప్రకటించారు. కల్వకుర్తి టికెట్ దక్కకపోవడం ఆయన కొన్ని రోజులుగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా పార్టీ మానున్నట్లు ప్రకటించారు. ఇటీవల ఆయనను మంత్రి కేటీఆర్ (Minister KTR) పిలిపించుకుని మాట్లాడారు. ఎన్నికల తర్వాత కేబినెట్ హోదా కలిగిన పదవి ఇస్తానని కసిరెడ్డికి కేటీఆర్ హామీ కూడా ఇచ్చినట్లు సమాచారం. అయినా వెనక్కు తగ్గని కసిరెడ్డి పార్టీ మారనున్నట్లు ప్రకటించారు. తాజాగా హైదరాబాద్ లోని తన నివాసంలో పార్టీ తన అనుచరులు, తనకు మద్దతుగా ఉంటున్న ప్రజాప్రతినిధులు, నాయకులతో సమావేశమయ్యారు.
పూర్తిగా చదవండి..Telangana Politics: ఫలించని కేటీఆర్ బుజ్జగింపు.. కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ?
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి బీఆర్ఎస్ ను వీడనున్నట్లు ప్రకించారు. త్వరలోనే ఆయన కాంగ్ఎస్ లో చేరనున్నట్లు తెలుస్తోంది. కల్వకుర్తి ఎమ్మెల్యే టికెట్ దక్కకపోవడంతో ఆయన కొన్ని రోజులుగా బీఆర్ఎస్ పార్టీపై అసంతృప్తితో ఉన్నారు.

Translate this News:











