ఈ నెల 15న బీఆర్ఎస్(BRS) పార్టీ మేనిఫెస్టో(Manifesto) వచ్చిన తర్వాత ప్రతిపక్షాలకు మైండ్ బ్లాక్ అవుతుందని మంత్రి హరీశ్ రావు సెటైర్లు వేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ సబ్ స్టేషన్ పక్కన మైదానంలో ఈనెల 15న జరుగనున్న సీఎం కేసీఆర్ బహిరంగ సభ స్థలాన్ని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎమ్మెల్యే సతీష్ కుమార్‌తో కలిసి మంత్రి హరీశ్ రావు పరిశీలించారు. తర్వాత బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన హరీశ్‌రావు కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. ఆసత్య సర్వేల పేరిట అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ గోబల్స్ ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. కనీసం టికెట్లు కూడా ఇచ్చుకోలేని దయనియ స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉందని ఎద్దేవా చేశారు.
పూర్తిగా చదవండి..TS politics: అప్పటివరకు వెయిట్ చేయండి.. ఇక ప్రతిపక్షాల మైండ్ బ్లాకే.. టికెట్ల కోసం కుస్తీలా?
కాంగ్రెస్, బీజేపీపై మంత్రి హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. ఈ నెల 15 కేసీఆర్ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బహిరంగ సభ తర్వాత ప్రతిపక్షాల మైండ్ బ్లాకేనన్నారు. ఎవరెన్ని జిమ్మిక్కులు చేసినా ఈసారి కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమన్నారు హరీశ్‌రావు. కనీసం టికెట్లు కూడా ఇచ్చుకోలేని దయనియ స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉందని ఎద్దేవా చేశారు.

Translate this News:











