అసలు తమ ఆస్తులు తమకు దక్కుతాయో లేవో అనే అనుమానం.. దినదినగండం నూరేళ్ల ఆయుష్షు అన్నట్టుగా ఉండేది ఇప్పటివరకు వారి పరిస్థితి. తాజాగా తెలంగాణ రాష్ట్ర సర్కార్ వీరికి యాజమాన్య హక్కులను అందిస్తుండడంతో ఆ పరిస్థితి మారింది. ఈ రోజు ఆ గ్రామస్తుల కళ సాకారమైంది. 60 ఏళ్లుగా గ్రామస్తులు భూములు ఉన్నా.. పట్టా లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల తమ బాధలు తెలంగాణ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంతో సమస్య పరిష్కారమైంది. గోదావరిఖనిలో జరిగే సభలో రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా గ్రామస్తులు పట్టాలు అందుకోనున్నారు ఈ గ్రామస్తులు.
పూర్తిగా చదవండి..Telangana News: 60 ఏళ్ల తర్వాత ఆ గ్రామస్తుల్లో సంతోషం.. అసలేం జరిగిందో తెలుసా?
పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం అంతర్గం మండలం పెద్దంపేట, రాయదండి గ్రామాల పరిస్థితి. రెండు గ్రామాలకు చెందిన సుమారు 1000కి పైగా ఎకరాల ఇల్లు, వ్యవసాయ భూములు 1947లో అప్పటి నిజాం ప్రభుత్వం అజామాబాద్ ఇండస్ట్రీస్ విద్యుత్ ప్లాంట్ను ఏర్పాటు చేసేందుకు ప్రజల నుంచి సేకరించింది. వారికి పరిహారం ఇవ్వకపోగా.. ఆ భూముల్లో ఎలాంటి నిర్మాణం జరగలేదు. నేడు ఆ భూముల పట్టాలను గ్రామస్తులకు అందించనున్నారు మంత్రి కేటీఆర్.

Translate this News:











