ఉస్మానియా యూనివర్సిటీ (OU)లో చదువుకుంటున్న విద్యార్థినిపై అత్యచారయత్నం చేశారు గుర్తుతెలియని వ్యక్తులు. ఆగ్రహించిన క్యాంపస్ విద్యార్థులు వీసీ క్యాంపస్ ఎదుట తెల్లవారుజామున 3:30 గంటల వరకు ఆందోళన చేశారు. వివరాల్లోకి వెళ్తే.. యూనివర్సిటీలో ఎంఏ కోర్స్ చేస్తున్న విద్యార్థినిపై ఈనెల 18వ తేదీన అంటే బుధవారం రాత్రి 10:30 గంటల సమయంలో విద్యార్థిని నడుచుకుంటూ వెళ్తోంది. ఆ సమయంలో ఇద్దరు వ్యక్తులు యువతిని అడ్డగించారు. ఆమెపై అత్యాచార యత్నం చేశారు. దాంతో యువతి వారిని ప్రతిఘటించింది. గట్టిగా కేకలు వేయడంతో.. నిందితులు పారిపోయారు. విషయాన్ని తన సహ విద్యార్థులకు తెలియజేయగా.. వారితో కలిసి వెళ్లి ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. విద్యార్థిని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బాధితురాలిని బరోసా సెంటర్కు తరలించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా ఓయూ పోలీసులు దర్యాప్తు చేసి రిపోర్టు తెప్పించుకుకున్నారు.
పూర్తిగా చదవండి..Telangana News: ఓయూలో దారుణం.. విద్యార్థినిపై అత్యాచారయత్నం
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. ఈమధ్య కాలంలో అమ్మాయిలకు రక్షణ లేకుండా పోయింది. బయటకు అడుగుపెడితే ఎలాంటి సమస్య వస్తుందని భయం ఎక్కువైపోతుంది. తాజాగా ఉస్మానియా యూనివర్సిటీలో మరో ఘటన కలకలం రేపుతోంది.

Translate this News:











