తెలంగాణలోని నిరుద్యోగులకు మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadeesh Reddy) అదిరిపోయే శుభవార్త చెప్పారు. 670 ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ (Telangana Job Notification) విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. టీఎస్ఎస్పీడీసీఎల్ లో నూతనంగా జూనియర్ లైన్ మెన్ గా నూతనంగా నియమితులైన 1362 మందికి మంత్రి నియామక పత్రాలను అందజేశారు. శనివారం రాత్రి ఎస్ఆర్ నగర్ లోని జెన్కో ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో గడిచిన తొమ్మిదిన్నర ఏళ్లలో విద్యుత్ రంగంలో 35,774 ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. అందులో ఔట్ సోర్సింగ్ ద్వారా టీఎస్ఎస్పీడీసీఎల్ నియమించిన 10,312, ట్రాన్స్ కోలో 4,403, జెన్కో లో 3,689, ఎన్పీడీసీఎల్ లో 4,370 మొత్తం కలిపి 22,774 మంది ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశామని వివరించారు.
పూర్తిగా చదవండి..Telangana Govt Jobs: తెలంగాణలో మరో 670 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. నిరుద్యోగులకు మంత్రి శుభవార్త
తెలంగాణలోని నిరుద్యోగులకు మంత్రి జగదీశ్ రెడ్డి మరో శుభవార్త చెప్పారు. త్వరలోనే విద్యుత్ శాఖలో మరో 670 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు చెప్పారు.

Translate this News:











