సెప్టెంబర్ 17న ఇక్కడ జరిగే తెలంగాణ ‘విమోచన దినోత్సవం’ వేడుకలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరవుతారని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాన్ని పరేడ్ గ్రౌండ్లో కేంద్రం నిర్వహించనుంది. అప్పటి హైదరాబాద్ స్టేట్ సెప్టెంబర్ 17, 1948న ఇండియన్ యూనియన్‌లో విలీనమైంది. నిజానికి గతేడాది కూడా అమిత్‌షా మీటింగ్‌కి వచ్చారు. విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్రం ఇక్కడ అధికారిక కార్యక్రమాన్ని నిర్వహించింది. గతేడాది ఆ సమావేశంలో ఇచ్చిన మాట ప్రకారం ఈ ఏడాది కూడా అమిత్ షా హైదరాబాద్ వస్తున్నారని.. ఇదే ఈవెంట్ నిర్వహిస్తున్నామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్ రాష్ట్రపతి నిలయంలో ప్రెసిడెన్షియల్ రిట్రీట్‌లలో మరో కార్యక్రమం జరగనుండగా.. రాష్ట్రపతి ముర్ము వర్చువల్‌గా హాజరవుతారని చెప్పారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కూడా హాజరవుతారు.
పూర్తిగా చదవండి..Amit shah visit: అమిత్‌షా వస్తున్నారు… షెడ్యూల్ ఇదే..!
అమిత్‌షా తెలంగాణ పర్యటన ఖరారైంది. ఈ నెల 16న రాష్ట్రానికి రానున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా. 17న విమోచన దినోత్సవ సభలో పాల్గొననున్నారు. 16న రాత్రి 8 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు రానున్న అమిత్ షా.. సీఆర్పీఎఫ్ సెక్టార్ మెస్‌లో బస చేయనున్నారు. సభ తర్వాత ఢిల్లీకి కేంద్ర హోంమంత్రి తెలంగాణ బీజేపీ నేతలతో సమావేశమయ్యే ఛాన్స్ ఉంది. పార్టీ బలోపేతంపై నేతలతో మంతనాలు జరిపారు.

Translate this News:











