ఏడాది కాలంగా తెలుగునాట ప్రముఖులను కలుస్తూ..వారితో భేటీ అవుతోంది బీజేపీ. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ లాంటి టాప్ హీరోలతో మీటింగ్ పెట్టిన కేంద్ర బీజేపీ పెద్దలు తాజాగా బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ పీవీ సింధుతో భేటీ అయ్యారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌కు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో పీవీ సింధు భేటీ అయ్యారు. కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డితోనూ పీవీ సింధు భేటీ అవ్వడం చర్చనీయాంశమవుతోంది. పీవీ సింధు బీజేపీలో చేరుతారా లేదా సెలబ్రెటీలను కలిసే క్రమంలోనే జరిగిన సాధారణ భేటీనా అన్న విషయంపై పలువురు వివిధ రకాలుగా చర్చించుకుంటున్నారు.
పూర్తిగా చదవండి..PV Sindhu meets Amit Shah: అమిత్‌షాతో పాటు కిషన్‌రెడ్డిని కలిసిన బ్యాడ్మింటర్ స్టార్ పీవీ సింధు!
పీవీ సింధు నిబద్ధత, కృషి, అంకితభావం యువ తరానికి స్ఫూర్తిగా నిలుస్తాయని ప్రశంసల వర్షం కురిపించారు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా. రేపు(సెప్టెంబర్ 17) హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన అమితి షా ఈ బ్యాడ్మింటన్ స్టార్‌ని కలిశారు. ఇక తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డితోనూ పీవీ సింధు భేటీ అవ్వడం చర్చనీయాంశమవుతోంది.

Translate this News:












