తెలంగాణలో సింగరేణి ఎన్నికలకు (Singareni Elections) హైకోర్టు బ్రేక్ వేసింది. ఎన్నికలను వాయిదా వేయాలని ఆదేశించింది. డిసెంబర్ 27 వరకు ఈ ఎన్నికలను వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు (Telangana High Court). నంబంబర్ 30లోపు ఓటర్ లిస్ట్ తయారు చేయాలని ఆదేశించింది. ఎన్నికలకు సహకరించాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది తెలంగాణ హైకోర్టు. వాస్తవానికి ఈ నెల 28న సింగరేణి ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే.. తొలుత హైకోర్టు ఇచ్చిన తీర్పుమేరకు కేంద్ర కార్మిక శాఖ ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదల చేసింది. దీనిపై యాజమాన్యం అప్పీల్ కు వెళ్లింది. వరుసగా పండుగలు, అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించలేమని యాజమాన్యం కోర్టుకు విన్నవించింది. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి ధర్మాసనం కూడా ఎన్నికలు నిర్వహించాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ.. మేనేజ్మెంట్ మళ్లీ ఫుల్ బెంచ్ ను ఆశ్రయించింది. దీంతో ఈ రోజు ఎన్నికలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది తెలంగాణ హైకోర్టు.
ఇది కూడా చదవండి: TS TRT 2023 Exam: టీఆర్టీ కూడా వాయిదా ? లేటెస్ట్ అప్డేట్ ఇదే!
Big Breaking: సింగరేణి ఎన్నికలకు హైకోర్టు బ్రేక్.. కీలక ఆదేశాలు జారీ!
తెలంగాణలో సింగరేణి ఎన్నికలు వాయిదా పడ్డడాయి. తెలంగాణ హైకోర్టు డిసెంబర్ 27 వరకు ఈ ఎన్నికలను వాయిదా వేయాలని ఆదేశాలు జారీ చేసింది. నవంబరర్ 30లోగా ఓటరు లిస్టు తయారు చేయాలని అధికారులను ఆదేశించింది.

Translate this News:











