గణేశ్ నిమజ్జనంపై (Ganesh Nimajjanam 2023) తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పీఓపీ విగ్రహాలను జీహెచ్ఎంసీ (GHMC) ఏర్పాటు చేసిన కృత్రిమ నీటి కుంటల్లోనే నిమజ్జనం చేయాలని తెలిపింది. హుస్సేన్ సాగర్, చెరువుల్లో పీఓపీ విగ్రహాలను నిమజ్జనం చేయవద్దని స్పష్టం చేసింది. వీటిలో కేవలం మట్టి విగ్రహాలను మాత్రమే నిమజ్జనం చేయాలని ఆదేశాల్లో స్పష్టం చేసింది తెలంగాణ హైకోర్టు. హైకోర్టు ఉత్తర్వులను యాధావిధిగా అమలు చేయాలని ఆదేశాల్లో స్పష్టం చేశారు. ఈ మేరకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్, జీహెచ్ఎంసీ కమిషనర్ కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్ లో గణేశ్ నవరాత్రి ఉత్సవాలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా గణేశ్ నిమజ్జనం వేడుకలు వైభవంగా జరుగుతాయి. ఈ ఏడాది హైదరాబాద్ లో దాదాపు లక్ష మండపాలు ఏర్పాటు చేసినట్లు అంచనా. వీటిలో అత్యధిక శాతం హుస్సేన్ సాగర్ లోని నిమజ్జనం చేయాలని నిర్వాహకులు భావిస్తుంటారు. మరికొన్నింటిని సరూర్ నగర్ చెరువు, మల్కం చెరువుతో పాటు శివారు ప్రాంతాల్లోని చెరువుల్లో నిమజ్జనం చేస్తూ ఉంటారు. అయితే.. హైదరాబాద్ లోని ఏర్పాటు చేసిన అనేక విగ్రహాలను హుస్సేన్ సాగర్ లోనే నిమజ్జనం చేయాలన్న సెంటిమెంట్ కూడా చాలా మంది భక్తుల్లో ఉంటుంది. కోర్టు ఆదేశాలతో వారు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తిగా మారింది.
ఇది కూడా చదవండి: Ganesh Chaturthi 2023: విద్యార్థులు గణేశుడి దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన విషయాలివే!
Ganesh Nimajjanam 2023: గణేశ్ నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు
గణేశ్ నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పీఓపీ విగ్రహాలను జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన కృత్రిమ నీటి కుంటల్లోనే నిమజ్జనం చేయాలని తెలిపింది. హుస్సేన్ సాగర్, చెరువుల్లో పీఓపీ విగ్రహాలను నిమజ్జనం చేయవద్దని స్పష్టం చేసింది.

Translate this News:











