Navdeep: డ్రగ్స్ కేసులో నిందితుడుగా ఉన్న నటుడు నవదీప్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దాని మీద ఈరోజు విచారణ జరిగింది. ఆయన వేసిన పిటిషన్ ను హైకోర్టు తోసిపుచ్చింది. నవదీప్ మీద ఇంతకు ముందు కూడా డ్రగ్స్ కేసులు ఉన్నాయని కోర్టుకు పోలీసులు వివరించారు. కానీ గతంలో డ్రగ్స్ కేసుల్లో నవదీప్ నిందితుడిగా లేడని అతని తరుఫు న్యాయవాది సిద్ధార్ధ్ వాదించారు. ఇంతకు ముందు దర్యాప్తు సంస్థల ముందు కూడా హాజరయ్యారని కోర్టుకు వివరించారు.
ఇరువర్గాల వాదనలను విన్న కోర్టు నవదీప్ వేసిన పిటిషన్ ను కొట్టేసింది. అతనికి 41A కింద నోటీసులు ఇవ్వాలని నార్కోటిక్ పోలీసులకు ఆదేశాలను జారీ చేసింది. అలాగే విచారణ కోసం నవదీప్ కోర్టుకు హాజరు కావాలని స్పష్టం చేసింది. కాగా, మాదాపూర్ డ్రగ్స్ కేసులో నవదీప్ ను పోలీసులు ఏ29గా పేర్కొన్నారు.
పూర్తిగా చదవండి..











