మద్యపాన రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించిందని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి- పద్మావతి దంపతులు ఆరోపించారు. సీఎం కేసీఆర్ సూర్యాపేట జిల్లాలో ఏర్పాటు చేసిన సభలో కాంగ్రెస్‌పై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడిన ఉత్తమ్ కుమార్ రెడ్డి- పద్మావతి దంపతులు.. దేశంలో మద్యం అమ్మకాల్లో తెలంగాణ ముందుందన్నారు. ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా మార్చారని విమర్శించారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా అని వారు ప్రశ్నించారు. గతంలో సోనియా గాంధీ కాళ్లు పట్టుకున్న కేసీఆర్.. ఇప్పుడు రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందనడం సిగ్గు చేటన్నారు.
పూర్తిగా చదవండి..Uttam Kumar Reddy: మద్యపాన రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించింది
సీఎం కేసీఆర్‌పై ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 50 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదని కేసీఆర్ అనడం సిగ్గుచేటని విమర్శించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తాను, తన సతీమణి పద్మావతి రెడ్డి కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో పోటీలో ఉండబోతున్నామని ఎంపీ ప్రకటించారు.

Translate this News:











