తెలంగాణ గవర్నర్ తమిళిసై మరోసారి కేసీఆర్ సర్కార్ కు షాక్ ఇచ్చారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రభుత్వం పంపించిన సిఫార్సులను తిరస్కరించారు. దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ అభ్యర్థిత్వానికి ప్రభుత్వం పంపించిన సిఫార్సులను తిరస్కరించారు. రాజకీయ నేతలను సిఫార్సు చేయవద్దని ఈ సందర్భంగా కేసీఆర్ సర్కార్ కు తమిళిసై సూచించారు. అర్హులను సిఫార్సు చేస్తే ఆమోదిస్తానని స్పష్టం చేశారు. ఈ ఇద్దరు నేతలను ఎమ్మెల్సీలుగా ఎంపిక చేయడానికి కావాల్సిన సమాచారం లేదని ఈ సందర్భంగా గవర్నర్ తెలిపారు. నిబంధనల ప్రకారం.. దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణకు ఎమ్మెల్సీలుగా ఎన్నిక కావడానికి అర్హత లేదన్నారు గవర్నర్. ఆర్టికల్ 171 (5) ప్రకారం గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా రాజకీయ నేతలను సిఫార్సు చేయవద్దని ఈ సందర్భంగా తమిళిసై సూచించారు.
పూర్తిగా చదవండి..Big Breaking: తెలంగాణ సర్కార్ కు గవర్నర్ తమిళిసై మరో షాక్.. ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాల తిరస్కరణ
తెలంగాణ గవర్నర్ తమిళిసై మరోసారి కేసీఆర్ సర్కార్ కు షాక్ ఇచ్చారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రభుత్వం పంపించిన సిఫార్సులను తిరస్కరించారు. దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ అభ్యర్థిత్వానికి ప్రభుత్వం పంపించిన సిఫార్సులను తిరస్కరించారు.

Translate this News:











