Telangana Govt Dussehra Holidays: తెలంగాణ ప్రభుత్వం దసరా సెలవు తేదీని మార్చింది. తొలుత ప్రభుత్వం ఈ నెల 24న దసరా పండుగ సెలవును ప్రకటించింది. ఆ మరుసటి రోజు అయిన 25వ తేదీ నాడు కూడా సెలవు ఉంటుందని వెల్లడించింది. అయితే.. ఆ దసరా సెలవును ఈ నెల 23కు మార్చుతున్నట్లు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఆ మరుసటి రోజు ఈ నెల 24న కూడా సెలవు ఉంటుందని వెల్లడించింది కేసీఆర్ సర్కార్ (Telangana Government). ఈ ఏడాది దసరా పండుగ విషయంలో కాస్త సందిగ్ధం నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో 23 అని, మరి కొన్ని ప్రాంతాల్లో 24వ తేదీ అంటూ ప్రచారం సాగింది. ఈ నేపథ్యంలో తెలంగాణ విద్వత్ సభ ఈ నెల 23న దసరా పండుగ జరుపుకోవాలని ఇటీవల స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: Breaking News: నవంబర్ 30న తెలంగాణ ఎన్నికలు.. నుంచి నామినేషన్లు.. ముఖ్యమైన తేదీలివే!
Big Breaking: తెలంగాణలో దసరా సెలవుల తేదీలు మార్పు.. సర్కార్ కీలక ఉత్తర్వులు
దసరా సెలవుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తాజాగా కీలక ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి ఈ నెల 24న దసరా సెలవు ఉంటుందని మొదట ప్రకటించగా.. తాజాగా ఆ తేదీని ఈ నెల 23కు మార్చింది ప్రభుత్వం. దీంతో పాటు ఈ నెల 24న కూడా సెలవు ఉంటుందని స్పష్టం చేసింది.

Translate this News:












