Amit Shah Comments on CM KCR: బీఆర్ఎస్ టార్గెట్‌గా కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) సంచలన కామెంట్స్ చేశారు. కేటీఆర్(KTR)ను ముఖ్యమంత్రిని చేయటానికి.. కవిత(MLC Kavitha) జైలుకు పోకుండా కాపాడుకోవడానికి కేసీఆర్(CM KCR) ప్రయత్నిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీకి సిద్ధాంతాలు, విధానాలు ఏమీ లేవని విమర్శించారు. ఆదిలాబాద్ సభ అనంతరం హైదరాబాద్‌కు వచ్చిన అమిత్ షా.. బీజేపీ ఆధ్వర్యంలో సిక్ విలేజ్ లోని ఇంపీరీయల్ గార్డెన్స్‌లో నిర్వహించిన మేధావుల సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ప్రసంగించిన కేంద్ర హోంమంత్రి.. సీఎం కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కారు స్టీరింగ్ మజ్లిస్ చేతిలో ఉందన్నారు. పదేళ్లు అవినీతిలో మునిగిపోయిన వారికి మళ్లీ అవకాశం ఇవ్వొద్దని అన్నారు. రానున్న ఐదేళ్లు మంచి పాలన ఎవరు ఇవ్వగలరో తెలంగాణ సమాజం ఆలోచించాలని మేథావులకు సూచించారు అమిత్ షా. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండూ కుటుంబ పార్టీలేనని విమర్శించారాయన.
పూర్తిగా చదవండి..Amit Shah: సీఎం కేసీఆర్ టార్గెట్‌గా సంచలన కామెంట్స్ చేసిన అమిత్ షా..
బీఆర్ఎస్ టార్గెట్‌గా కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంచలన కామెంట్స్ చేశారు. కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయటానికి.. కవిత జైలుకు పోకుండా కాపాడుకోవడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీకి సిద్ధాంతాలు, విధానాలు ఏమీ లేవని విమర్శించారు.

Translate this News:











