Minister Harish Rao Comments on Chandrababu Arrest: తెలంగాణలో ఎన్నికల తేదీ సమీపిస్తున్న వేళ ప్రధాన పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. ఇక అధికార బీఆర్ఎస్(BRS) పార్టీ అయితే.. మిగతా పార్టీలకంటే ముందు వరుసలో దూసుకుపోతుంది. ఓవైపు సీఎం కేసీఆర్(CM KCR) రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తుండగా.. మరోవైపు జోడు గుర్రాల్లా మంత్రులు కేటీఆర్(KTR), హరీష్ రావు(Harish Rao).. అటు పర్యటనలతో పాటు, టీవీలకు ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రత్యర్థులను చెడుగుడు ఆడుకుంటున్నారు. తాజాగా మంత్రి హరీశ్ రావు ఆర్టీవీకి ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్య్వూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సారి 100 స్థానాల్లో గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేసిన ఆయన.. కాంగ్రెస్ రనౌట్, బీజేపీ డకౌట్ ఖాయమన్నారు.
పూర్తిగా చదవండి..Harish Rao: చంద్రబాబు అరెస్ట్, ఓటుకు నోటు కేసుపై హరీశ్ రావు సంచలన కామెంట్స్!
చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై సంచలన కామెంట్స్ చేశారు మంత్రి హరీష్ రావు. బాబు అరెస్ట్‌ను ఖండిస్తున్నామన్నారు. కక్షపూరితమైన పాలిటిక్స్ అనేది మంచిది కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పాటై తొమ్మిదిన్నర ఏళ్లలో ఏనాడూ తాము ఇలా రాజకీయాలు చేయలేదున్నారు. ఒకవేళ తామే చేయాలనుకుంటే.. ఓటుకు నోటు కేసు సహా అనేక అంశాల్లో ఎవరూ జైలు నుంచి బయటకు రాకపోయేవారని వ్యాఖ్యానించారు.

Translate this News:











