Congress MLA Second List: శుక్రవారం సాయంత్రంలోగా తెలంగాణకు(Telangana) సంబంధించి 45 మంది అభ్యర్థులతో రెండవ జాబితాను విడుదల చేస్తామని కాంగ్రెస్ ఎలక్షన్ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ తెలిపారు. మిగతా స్థానాలపై నిర్ణయాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు(Congress) తీసుకుంటారని తెలిపారు. శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన మురళీధరన్.. కమ్యూనిస్టు పార్టీలతో చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. చెరో రెండు సీట్లు ఇచ్చే విషయంలో అంగీకారం కుదిరిందన్నారు. అయితే, వారికి ఏ స్థానాలు ఇవ్వాలన్న దానిపైనే ఏకాభిప్రాయం రావాల్సి ఉందన్నారు. ఒకటి రెండు రోజుల్లోనే పొత్తుల వ్యవహారం కొలిక్కి వస్తుందని చెప్పారు మురళీధరన్. అదే సమయంలో సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నచోట మిత్రపక్షాలకు సీటు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు మురళీధరన్.
పూర్తిగా చదవండి..Telangana Elections: మరికాసేపట్లో తెలంగాణ కాంగ్రెస్ సెకండ్ లిస్ట్.. అభ్యర్థులు వీరేనా?!
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల సెకండ్ లిస్ట్ విడుదలకు సమయం ఆసన్నమైంది. ఇవాళ సాయంత్రంలోగా సెకండ్ లిస్ట్ విడుదల చేస్తామని సీఈసీ చైర్మన్ మురళీధరన్ తెలిపారు. సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డి నుంచి రేవంత్ రెడ్డిని బరిలోకి దించనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. పొంగులేటి, తుమ్మల స్థానాలపైనా క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం. ఇక నిన్న కాంగ్రెస్లో చేరిన రాజగోపాల్ రెడ్డికి మునుగోడు, రవీందర్ రెడ్డికి బాన్సువాడ స్థానాలను కన్ఫామ్ చేసిందట కాంగ్రెస్.

Translate this News:











