Telangana Elections: తెలంగాణలో ఓవైపు అధికార బీఆర్ఎస్ పార్టీ(BRS) ప్రచార పర్వంలో దూసుకుపోతోంది. ఇప్పటికే అభ్యర్థులందరినీ ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు. భారీ ఎత్తున బహిరంగ సభలు నిర్వహిస్తూ ప్రజా ఆశీర్వాదం పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నారు. కానీ, ఈ సారి అధికారం మాదే అంటున్న కాంగ్రెస్(Congress), బీజేపీ(BJP) మాత్రం ఇంకా అభ్యర్థుల ఎంపిక వద్దనే నిలిచిపోయాయి. ఈ విషయంలో కాంగ్రెస్ కాస్త బెటర్ ప్లేస్‌లో ఉన్నా.. బీజేపీలో మాత్రం ఆ ఊసే కనిపించడం లేదు. రేపో, మాపో ప్రకటిస్తామని చెబుతున్నారు కానీ.. అలాంటి పరిస్థితి అయితే ఏదీ కనిపించడం లేదు. అయితే లిస్ట్ ఆలస్యానికి కాంగ్రెస్ కారణం అని పొలిటికల్ సర్కిల్లో టాక్ నడుస్తోంది. బీజేపీకి, కాంగ్రెస్ లిస్ట్‌కి సంబంధం ఏంటబ్బా అని ఆలోచిస్తున్నారా? అవును, ఇక్కడే అసలు ట్విస్ట్. దాన్ని బేస్ చేసుకునే బీజేపీ తన అభ్యర్థుల ప్రకటనపై ఒక అడుగు వెనక్కే ఉంది.
పూర్తిగా చదవండి..Telangana Elections: కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ కోసం బీజేపీ వెయిటింగ్? సీక్రెట్ ఇదేనా!
అభ్యర్థుల ప్రకటన విషయంలో కాంగ్రెస్, బీజేపీ మధ్య హైడ్ సీక్ గేమ్ కనిపిస్తోంది. ప్రధానంగా కాంగ్రెస్ లిస్ట్ పైనే బీజేపీ ఆశగా ఎదురు చూస్తున్నట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇప్పటికే తొలి జాబితాను ప్రకటించింది కాంగ్రెస్. ఆ లిస్ట్‌లో పేరు లేని నాయకులు.. ఇతర పార్టీల్లోకి జంప్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారు. అలాంటి నేతలను తమ పార్టీలోకి చేర్చుకునేందుకు బీజేపీ సిద్ధంగా ఉంది. అందుకే.. కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ కోసం బీజేపీ ఎదురు చూస్తోందని టాక్.

Translate this News:











