BJP revokes suspension of MLA Raja Singh: బీజేపీ అధిష్టాన సంచలన నిర్ణయం తీసుకుంది. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సింగ్‌పై (MLA Raja Singh) విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేసింది. మరో 40 రోజుల్లో తెలంగాణలో ఎన్నికలు (Telangana Elections 2023) జరుగనున్న నేపథ్యంలో బీజేపీ తమ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్‌ను రెడీ చేసింది. ఈ తొలి జాబితాలో గోషామహల్ ఎమ్మెల్యేగా రాజాసింగ్ పేరును కూడా ఖారారు చేసినట్లు సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలోనే రాజాసింగ్‌పై గతంలో పార్టీ విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేసింది.
పూర్తిగా చదవండి..MLA Raja Singh: బీజేపీ సంచలన నిర్ణయం.. ఎమ్మెల్యే రాజాసింగ్‌పై సస్పెన్షన్ ఎత్తివేత..
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ జాతీయ నాయకత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై ఆ పార్టీ విధించిన సస్పెషన్ ను ఎత్తివేసింది. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. మరోవైపు బీజేపీ సిద్ధం చేసిన తెలంగాణ ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితాలో రాజాసింగ్ పేరును ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం అందుతోంది. ఇక సస్పెప్షన్ ఎత్తివేయడంతో రాజాసింగ్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈసారి కూడా గోషామహల్ రాజాసింగ్ దే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Translate this News:












