Voter Registration: 2023 సంవత్సరానికి చేపట్టిన ఓటర్ల జాబితా రెండో సవరణలో అభ్యర్థనలు, అభ్యంతరాల స్వీకరణ ఘట్టం ఇవాళ్టి(సెప్టెంబరు, 19)తో ముగిసింది. అర్హులైన పౌరులు కొత్త ఓటర్లుగా నమోదు చేసుకునే ప్రక్రియ(ఫారం-6), ఓటర్ల జాబితా నుంచి చనిపోయిన వారు, చిరునామా మారిన వారి పేర్లు తొలగించే ప్రక్రియ(ఫారం-7), ఓటర్ల జాబితాలో వివరాలలో సవరణలు చేసే ప్రక్రియ (ఫారం-8) కింద అభ్యర్థనలు, అభ్యంతరాలను స్వీకరిస్తున్నట్లు గతంలో ప్రకటించారు. మొత్తం రాష్ట్రంలో ఈ నెల 18 వరకు-కొత్త ఓటర్ల నమోదుకు 13.06లక్షల దరఖాస్తులు, పేర్ల తొలగింపునకు 6.26 లక్షల దరఖాస్తులు, వివరాల సవరణకోసం 7.77 లక్షల దరఖాస్తులు అందాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఈ మేరకు రాష్ట్రంలో ఓటర్ల జాబితా సవరణకు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 4న తుది జాబితా వెల్లడించనున్నారు. 2023 జనవరి 1నాటికి 18ఏళ్లు నిండిన పౌరులందరికీ ఓటర్లుగా నమోదు చేసుకునేలా ఈసీ చర్యలు ఆరంభించింది.
పూర్తిగా చదవండి..Voters: ఓటర్ల జాబితా రెండో సవరణ… ముగిసిన అభ్యంతరాల స్వీకరణ ఘట్టం!
శాసనసభ ఎన్నికల కోసం రాష్ట్రంలో ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం రెండో దశ ముగిసింది. ప్రతి ఏటా ఒక విడత ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని చేపడుతుండగా.. అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాదిలో రెండో విడత కూడా చేపట్టారు. ప్రత్యేక సవరణ తర్వాత ఓటర్ల సంఖ్య పెరిగింది.

Translate this News:











