తెలంగాణలో శాననసభ ఎన్నికలకు (Telangana Assembly Elections) ముహూర్తం దగ్గర పడింది. ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. వచ్చే నెల 6వ తేదీన షెడ్యూల్ విడుదలయ్యే ఛాన్స్ ఉందని మీడియా కథనాలు వస్తున్నాయి. మరో వైపు.. ఎలక్షన్ కమిషన్ ఓటరు నమోదు, జాబితా తయారీపై కసరత్తు ముమ్మరం చేసింది. ఈ నెల 18వ తేదీ వరకు కొత్తగా ఓటు హక్కు కోసం మొత్తం 14 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. అయితే.. గతేడాది భారీగా ఓట్లు గల్లంతు కావడంతో ఆయా ఓటర్ల నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తం అయ్యింది. చివరి నిమిషంలో తమ ఓటు లేదని తెలిస్తే ఏం చేయాలని వారంతా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఓటర్లు ముందుగా తమ ఓటు చెక్ చేసుకోవడం బెటర్ అని అధికారులు సూచిస్తున్నారు. ఇందు కోసం ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లో కూర్చొనే ఓటు చెక్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది ఎన్నికల కమిషన్. మీరు మీ ఓటు ఉందా? లేదా? అన్న విషయాన్ని మీ ల్యాట్ ట్యాప్ లేదా స్మార్ట్ ఫోన్ లో క్షణాల్లో చెక్ చేసుకోవచ్చు.
పూర్తిగా చదవండి..Telangana CEO: తెలంగాణ ఓటర్లకు అలర్ట్.. ఈ లింక్ తో మీ ఓటును చెక్ చేసుకోండి!
తెలంగాణలో ఎన్నికలకు సంబంధించి మరో వారం పది రోజుల్లో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఓటర్లు ఈ సింపుల్ స్టెప్స్ తో ఓటర్ల జాబితాలో తమ పేరును చెక్ చేసుకోవచ్చు.

Translate this News:











