తెలంగాణ(Telangana)లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్(Greater Hyderabad) ప్రాంతానికి చెందిన 20 వేల మందికి పైగా ఓటు హక్కు కలిగి ఉన్నారు. ఐతే వింతేముందంటారా..! వారంతా చనిపోయిన సంవత్సరాలు గడిచిపోయాయి. కొంతమంది 20 ఏళ్ల క్రితమే తెలంగాణ విడిచివెళ్లినప్పటికీ..తెలంగాణ ఓటర్ల జాబితాలో వారి పేర్లను సజీవంగా ఉన్నాయి. ఇటీవల రాజకీయ పార్టీల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో GHMC అధికారులు ఈ విషయాన్ని అంగీకరించారు. ఇలా చనిపోయిన వారి పేర్లు తొలగించకపోవడం వల్ల దుర్వినియోగమయ్యే అవకాశాలున్నాయని పార్టీ నాయకులు అభిప్రాయపడ్డారు.
పూర్తిగా చదవండి..Telangana Voters: వారి పేర్లు దుర్వినియోగం అయ్యే ఛాన్స్.. తెలంగాణ ఓటర్ల లిస్ట్‌లో చనిపోయిన వారి సంఖ్య ఎంతో తెలుసా?
ఓటర్ల లిస్ట్‌లో చనిపోయిన వారి పేర్లు తొలగించకపోవడం వల్ల అవి దుర్వినియోగమయ్యే అవకాశాలున్నాయన్న అభిప్రాయాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఒక్క గ్రేటర్ హైదరాబాద్‌లోనే చనిపోయిన 20 వేల మందికి ఓటర్ లిస్టులో చోటు ఉన్నట్టు సమాచారం. ఇక 20 ఏళ్ల క్రితమే తెలంగాణ విడిచి వెళ్లినవారి పేరు కూడా తెలంగాణ ఓటర్ల లిస్ట్‌లో ఉన్నాయి.

Translate this News:











