తెలంగాణ ఎన్నికల్లో(Telangana elections) గెలుపు కోసం బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతున్నది. దక్షిణాదిన ఇప్పటికే కర్ణాటకను కోల్పోయిన బీజేపీ.. తెలంగాణలో అధికారంలోకి రావాలని తన అస్త్రశస్త్రాలను బయటకు తీస్తోంది. బీజేపీ టాప్ లీడర్లు రానున్న రోజుల్లో తెలంగాణలో భారీ ఎత్తున ప్రచారం చేయనున్నారు. బీజేపీ బిగ్-3గా పేరున్న ప్రధాని మోదీ(Modi), హోం మంత్రి అమిత్ షా(Amit shah), పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా(JP Nadda) ఎన్నికల ప్రచార బరిలోకి దూకుతున్నారు. ఒకటి కాదు రెండు ఏకంగా 25 బహిరంగ సభలకు బీజేపీ ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో వచ్చే నెల(నవంబర్)30న ఎన్నికల పోలింగ్ జరగనుండగా.. డిసెంబర్ 3న ఫలితాలు వస్తాయి.
పూర్తిగా చదవండి..Telangana elections 2023: రంగంలోకి ప్రధాని మోదీ.. బీజేపీ భారీ స్కెచ్!
తెలంగాణలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ తన బడా లీడర్లను రంగంలోకి దింపుతోంది. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భారీ బహిరంగ సభలకు బీజేపీ ప్లాన్ చేసింది. మొత్తం 25 బహిరంగ సభలు ప్లాన్ చేయగా.. అందులో మోదీ 5 సమావేశాల్లో ప్రసంగించనున్నారని సమాచారం. హైదరాబాద్ రోడ్ షోలోనూ మోదీ పాల్గొంటారని తెలుస్తోంది. అటు అమిత్ షా 8-10 సమావేశాలకు జేపీ నడ్డా కనీసం 10 సమావేశాల్లో పాల్గొంటారని తెలుస్తోంది.

Translate this News:











