అందరికంటే ముందు అభ్యర్థులను ఖరారు చేసింది, బీ ఫార్మ్ లు ఇచ్చింది, ప్రచారంలో ఉన్నది బీఆర్ఎస్నేనన్నారు మంత్రి కేటీఆర్. లాస్ట్ టైం ఖమ్మంలో మాకు లీడర్లు ఎక్కువ ఉన్నారని.. అయినా ఒక్కటే సీటు వచ్చిందని గుర్తు చేశారు కేటీఆర్. ఈ సారి లీడర్లు అందరూ వెళ్లారని.. సీట్లు ఎక్కువ వస్తాయని.. లీడర్లు వెళ్లినంత మాత్రాన ఓటర్లు మారరన్నారు. అప్పుడు కూడా సీ ఓటర్ సర్వే మా పార్టీ రాదని చెప్పిందని.. ఇప్పుడు కూడా అదే చెబుతున్నారన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి లాస్ట్ టైం కూడా గడ్డానికి కలర్ వేసుకుని రెడీ అయ్యాడు కానీ జనాలు వారికి ఓటు వేయలేదని కౌంటర్లు వేశారు. కాంగ్రెస్‌కు ముఖ్యమంత్రి అభ్యర్థులు ఆరుగురు దొరికారని.. కానీ ఓటర్లు దొరకడం లేదని వెటకారంగా మాట్లాడారు కేటీఆర్.
Also Read: ప్రముఖ నటికి షాకిచ్చిన కోర్టు..15 రోజుల్లో లొంగిపోవాల్సిందే అంటూ ఆదేశాలు!
కాంగ్రెస్‌కు వారి చరిత్రనే గుదిబండ.. లీడర్లు వెళ్లినంత మాత్రానా ఓటర్లు మారరు!
రాహుల్ గాంధీ లీడర్ షిప్ తీసుకొడని.. పెళ్లి చేసుకొడంటూ చురకలంటించారు మంత్రి కేటీఆర్. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు లీడర్‌గా ఉండలేనని రాహుల్ చెప్పారన్నారు. అందుకే రాహుల్ లీడర్ కాదు.. రీడర్ అంటూ కౌంటర్లు వేశారు కేటీఆర్. ఫ్లోరోసిస్ శాపం ఇచ్చిందే కాంగ్రెస్ అని.. ఫ్లోరోసిస్ రూపుమాపింది బీఆర్ఎస్ అంటూ హస్తం పార్టీపై ఫైర్ అయ్యారు.

Translate this News:











