తెలంగాణలో ఎన్నికల సమీపిస్తున్న వేళ అన్ని పార్టీలు దూకుడు పెంచాయి. ఇప్పటికే బీఆర్ఎస్ తన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను ప్రకటించగా.. ఇప్పుడు కాంగ్రెస్(Congress) ఆ పని చేసింది. 55 మందికి కూడిన ఫస్ట్ లిస్ట్‌ని కాంగ్రెస్ విడుదల చేసింది. ఫస్ట్ లిస్ట్ లో ఊహించిన విధంగానే ముఖ్య నేతలు రేవంత్ రెడ్డి-కొడంగల్, ఉత్తమ్ కుమార్ రెడ్డి- హుజూర్ నగర్, నల్గొండ-కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అందోలు-దామోదర్ రాజనర్సింహ, జగిత్యాల-జీవన్ రెడ్డి, మంచిర్యాల-ప్రేమ్ సాగర్ రావు, అలంపూర్-సంపత్ కుమార్, కొల్లాపూర్-జూపల్లి కృష్ణారావు, ములుగు-సీతక్క, మధిర-భట్టి విక్రమార్క సీట్లు ఉన్నాయి. నాగార్జునసాగర్ నుంచి జానారెడ్డి కుమారుడు జయవీర్ కు టికెట్ లభించింది. బీఆర్ఎస్ నుంచి వచ్చిన కసిరెడ్డి నారాయణ రెడ్డికి కల్వకుర్తి, వేముల వీరేశంకు నకిరేకల్, మల్కాజ్ గిరి నుంచి మైనంపల్లి హన్మంతరావు, మెదక్ నుంచి ఆయన కుమారుడు రోహిత్ కు టికెట్ దక్కింది. బీజేపీ నుంచి వచ్చిన వినయ్ రెడ్డికి ఆర్మూర్ టికెట్ లభించింది.
పూర్తిగా చదవండి..TS Congress: 55 మందితో కాంగ్రెస్ మొదటి జాబితా విడుదల.. లిస్ట్ ఇదే.. ఆ ముఖ్య నేతలకు షాక్?
తెలంగాణ ఎన్నికల వేళ కాంగ్రెస్ దూకుడు పెంచింది. 55 మందికి కూడిన ఫస్ట్ లిస్ట్‌ని కాంగ్రెస్ విడుదల చేసింది. ఏఐసీసీ ఫైనల్ చేసిన ఈ లిస్ట్‌ను విడుదల చేశారు.

Translate this News:













