తెలంగాణలో ఎన్నికల శంఖారావం పూరించేందుకు సీఎం కేసీఆర్(CM KCR) ఇవాళ(అక్టోబర్ 15) హుస్నాబాద్‌కి వెళ్తున్నారు. లక్షల మంది బీఆర్ఎస్(BRS) కార్యకర్తల మధ్య ప్రసంగించనున్నారు. 2014లోనూ, 2018 ఎన్నికలకు ముందు కూడా సీఎం హుస్నాబాద్(Husnabad) నుంచే ఎన్నికల కదనరంగంలోకి దూకారు. ఈ రెండు ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ ప్రత్యర్థులను మట్టికరిపించింది. అందుకే అదే సెంటిమెంట్‌ను కేసీఆర్ ఫాలో అవుతున్నట్టుగా తెలుస్తోంది. హుస్నాబాద్‌లో సాయంత్రం 4 గంటలకు జరిగే బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొంటారు. ఇది ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేసిన తర్వాత కేసీఆర్ పాల్గొంటున్న తొలి ప్రచార సభ. దీంతో ఈ మీటింగ్‌ను పెద్ద ఎత్తున విజయవంతం చేసేందుకు గులాబీ కార్యకర్తలు రెడీ అయ్యారు. లక్షల మంది జనసమీకరణ చేసినట్టుగా తెలుస్తోంది.
పూర్తిగా చదవండి..BRS Manifesto: ఇవాళ బీఆర్ఎస్ మ్యానిఫెస్టో విడుదల..హుస్నాబాద్ సభ నుంచి ఎన్నికల యుద్ధరంగంలోకి కేసీఆర్..!
తెలంగాణ సీఎం కేసీఆర్ దూకుడు పెంచారు. ఇవాళ(అక్టోబర్ 15) బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను ప్రకటించనున్నారు కేసీఆర్. తెలంగాణ భవన్లో జరిగే సమావేశంలో పాల్గొని మ్యానిఫెస్టోను విడుదల చేస్తారు. తర్వాత అభ్యర్థులకు ఫారమ్‌లను అందిస్తారు. పార్టీ పెండింగ్‌లో ఉంచిన ఐదు నియోజకవర్గాల్లో కనీసం రెండింటికి కూడా కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. అటు సాయంత్రం హుస్నాబాద్‌కి వెళ్తున్నారు కేసీఆర్. అక్కడ జరగనున్న బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

Translate this News:











