నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమం (సీడీపీ) కింద ప్రభుత్వం ఎమ్మెల్యేలకు నిధులు మంజూరు చేస్తుందన్న విషయం తెలిసిందే. ఈ నిధులను ఎమ్మెల్యేలు ఎలా వినియోగంచుకుంటున్నరాన్న దానిపై ఆ నియోజకవర్గ అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. కొంతమంది ఎమ్మెల్యేల స్టైల్ డిఫరెంట్గ ఉంటుంది. బయటకు ఎలాంటి పబ్లిసిటీలు చేసుకోకున్నా.. తమ పని మాత్రం సైలెంట్‌గా చేసుకుంటు పోతుంటారు. మరికొందరు ఎమ్మెల్యేలు పైకి అది చేస్తున్నాం.. ఇది చేస్తున్నాం అని చెబుతారు కానీ.. రియాల్టీలో నియోజకవర్గంలో ఎలాంటి మార్పూ కనపడదు. ఇంకొంతమంది చెప్పిందే చేస్తారు.. చేసేదే చెబుతారు.. ఇలాంటి వారు కాస్త అరుదు. తెలంగాణలో వచ్చే నెల(నవంబర్ 30)న పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న ఫలితాలు వస్తాయి. ఈ క్రమంలో తమ ఎమ్మెల్యేల పనతీరు ఎలా ఉందన్నదానిపై ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇటు హైదరాబాద్‌లో ఉన్న ఎమ్మెల్యేలపై ఓ లుక్కేయండి.
Also Read: సంచలన నిర్ణయం.. ఇకపై బుక్స్‌లో ‘ఇండియా’ పేరు ఉండదు..!
TS elections 2023: హైదరాబాద్‌లో ఫస్ట్ ఎవరు.. లాస్ట్ ఎవరు? అభివృద్ధికి ఏ ఎమ్మెల్యే ఎంత ఖర్చు చేశారంటే?
నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమం (సీడీపీ) నిధుల వినియోగంలో హైదరాబాద్ జిల్లాలో MIM నేతలు తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొయినుద్దీన్, నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మెరాజ్, బహదూర్‌పురా ఎమ్మెల్యే మహ్మద్ మౌజంఖాన్ ఫస్ట్ 3 స్థానాల్లో ఉండగా.. చివరి స్థానంలో ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్(బీఆర్ఎస్) ఉన్నారు. హైదరాబాద్ జిల్లాలో మొత్తం 15 నియోజవర్గాలున్నాయి.

Translate this News:












