తెలంగాణ ఎన్నికలు(Telangana elections) సమీపిస్తుండడంతో మాటల మంటలు రాజుకుంటున్నాయి. బీఆర్ఎస్(BRS), బీజేపీ(BJP), కాంగ్రెస్(Congress) నేతల పరస్పర ఆరోపణలతో రాజకీయంగా ఇప్పటికే రంజుగా మారింది. బీఆర్ఎస్, కాంగ్రెస్‌పై బీజేపి జాతీయ కార్యదర్శి బండి సంజయ్(Bandi sanjay) తీవ్ర ఆరోపణలు గుప్పించారు. కాంగ్రెస్ సీట్లను నిర్ణయించేది కేసీఆర్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు. అడ్డా మీది కూలీలను తెచ్చి కండువా వేస్తున్నది బీఅర్ఎస్ అంటూ ఫైర్ అయ్యారు. మోదీ బీఅర్ఎస్ బండారాన్ని బయట పెట్టారని విమర్శించారు. బీఅర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటేనని ప్రజలు గుర్తించారన్నారు బండి సంజయ్. దీంతో బీజేపీపై ప్రజలకు నమ్మకం పెరిగిందని తెలిపారు.
పూర్తిగా చదవండి..Telangana elections 2023: ఎమ్మెల్యేల సీట్ల విషయంలో బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు.. పాపం ఇది అతనికి తెలీదు!
సీట్ల విషయంలో కలిసి కట్టుగా చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు బీజేపి జాతీయ కార్యదర్శి బండి సంజయ్. తమ లిస్ట్ ఢిల్లీకి వెళ్ళిందని.. కాంగ్రెస్ లిస్ట్ మాత్రం ప్రగతి భవన్‌కి వెళ్ళిందని ఆరోపించారు సంజయ్. పెద్ద సర్ ఆమోదం కోసం లిస్ట్ వెయిట్ చేస్తున్నదంటూ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్‌లో రేవంత్‌రెడ్డికి ఈ విషయం తెలియదంటూ సెటైర్లు వేశారు. బీఆర్ఎస్లో హరీశ్‌రావు బకరా అంటూ కామెంట్స్ చేశారు.

Translate this News:











