తన బ్రెయిన్లోని అస్త్రశస్త్రాలతో ప్రత్యర్థి పార్టీల నేతలను ఉక్కిరిబిక్కిరి చేసే కేసీఆర్‌కే గట్టి షాక్ ఇచ్చే ప్లాన్ ఇది. ఆయనపై ఏకంగా 120మంది పోటీకి నిలపడనున్నారని సమాచారం. ఈ సారి ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేయనున్న కేసీఆర్‌కు.. కామారెడ్డిలో చెక్ పెట్టాలని మాస్టర్ ప్లాన్ బాధితులు ప్రణాళిక రచిస్తున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల వేళ మళ్లీ తెరపైకి మాస్టర్ ప్లాన్ వివాదం రావడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. కామారెడ్డి అసెంబ్లీ బరిలో రైతులు నిలపడనున్నారు. లింగాపూర్‌లో ఎనిమిది గ్రామాల మాస్టర్ ప్లాన్ బాధితులు సమావేశం అయ్యారు. 120మంది నామినేషన్లు వేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఉద్యమం ఉధృతం చేస్తామని బాధితుల హెచ్చరిస్తున్నారు. ఇక రైతుల నామినేషన్లతో ఏం జరగబోతోందనే ఉత్కంఠ నెలకొంది.
TS Elections 2023: కేసీఆర్‌కు షాక్.. సీఎంపై పోటీకి 120మంది..!
ఎన్నికలకు ముందు సీఎం కేసీఆర్‌కు బిగ్ షాక్ ఇచ్చారు కామారెడ్డి రైతులు. ఈ ఎన్నికల్లో కేసీఆర్ రెండు చోట్ల నుంచి పోటీ చేయనున్న విషయం తెలిసిందే. అందులో కామారెడ్డి ఒకటి. ఇక్కడ నుంచి అసెంబ్లీ బరిలో రైతులు నామినేషన్లు వేయనున్నారు. లింగాపూర్‌లో ఎనిమిది గ్రామాల మాస్టర్ ప్లాన్ బాధితులు సమావేశం అయ్యారు. 120మంది నామినేషన్లు వేయాలని నిర్ణయం తీసుకున్నారు.

Translate this News:











