ఎన్నికల కోడ్(Electoion code) అమల్లోకి వచ్చేసింది. తెలంగాణ ఎన్నికలు నవంబర్30న జరుగుతాయి. డిసెంబర్ 3న కౌంటింగ్ ఉంటుంది. తెలంగాణతో పాటు మరో నాలుగు రాష్ట్రాలకు అదే రోజు కౌంటింగ్ ఉంటుంది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, తెలంగాణ, మిజోరం రాష్ట్రాల ఎన్నికల తేదీలను ఎన్నికల సంఘం ప్రకటించింది. మిజోరంలో నవంబర్ 7న, ఛత్తీస్‌గఢ్‌లో నవంబర్ 7, 17 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. మధ్యప్రదేశ్‌లో నవంబర్ 17న, రాజస్థాన్‌లో నవంబర్ 23న ఎన్నికలు జరగనున్నాయి. ఇక తెలంగాణలో మోడల్ ప్రవర్తనా నియమావళి తక్షణమే అమల్లోకి వచ్చిందని ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్(Vikas raj) తెలిపారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులందరినీ ఎన్నికల కమిషన్‌కు డిప్యూటేషన్‌పై పరిగణనలోకి తీసుకున్నట్లు భావిస్తున్నట్లు చెప్పారు.
పూర్తిగా చదవండి..TS elections 2023: రాత్రి 10 గంటల తర్వాత ఆ పని చేయవద్దు.. ఎన్నికల కోడ్‌లో ఏం ఉందంటే?
తెలంగాణలో మోడల్ ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ కీలక సూచనలు చేశారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య ఎలాంటి లౌడ్ స్పీకర్లు యూజ్ చేయకూడదన్నారు వికాస్ రాజ్. ఇక మత స్థలాలు లేదా ఇతర ప్రార్థనా స్థలాలను ఎన్నికల ప్రచార వేదికగా ఉపయోగించకూడదు. స్టాటిక్ లేదా వెహికల్ మౌంట్ చేయకూడదు.

Translate this News:











