తెలంగాణలో టీడీపీ, జనసేన పొత్తు లెక్క తేలింది. ఏపీతో పాటూ తెలంగాణలోనూ ఇరు పార్టీలు కలిసే ఎన్నికలకు వెళ్లనున్నట్లు స్పష్టమవుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 32 స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే జనసేన ప్రకటించగా.. తాజాగా 87 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు టీడీపీ ప్రకటించింది. దీంతో ఇరు పార్టీలు కలిసి మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేయబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే జనసేన తరఫున పోటీ చేయనున్న 32 మంది అభ్యర్థుల జాబితాను జనసేన ప్రకటించేసింది. ఇప్పుడు మిగిలిన 87 స్థానాల్లో అభ్యర్థులను టీడీపీ సిద్ధం చేస్తోంది. తెలంగాణలోనూ కలిసే వెళ్లాలని నిర్ణయించుకున్న ఇరు పార్టీలు.. పోటీ చేసే స్థానాలు, అభ్యర్థులపై ముందు నుంచే వ్యూహాత్మకంగా పావులు కదిపినట్లు తెలుస్తోంది. టీడీపీ అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ అధినేత చంద్రబాబు పరిశీలించి ఓకే చేయాల్సి ఉంది. ఆ వెంటనే అభ్యర్థుల జాబితాతో పాటూ, మేనిఫెస్టోను కూడా ప్రకటించేందుకు తెలంగాణ టీడీపీ సిద్ధమవుతోంది. అటు ఏపీలో ఇప్పటికే పొత్తు ప్రకటించిన టీడీపీ, జనసేన… బీజేపీ కూడా తమతో కలిసి రావాలని కోరుకుంటున్నాయి. ఈ అంశంలో మరికొద్ది రోజుల్లో క్లారిటీ వస్తుందని భావిస్తున్నాయి. ఆ వెంటనే తెలంగాణలో ఎన్నికల స్ట్రాటజీ అమలు చేయాలని ఇరు పార్టీలు భావిస్తున్నాయి.
పూర్తిగా చదవండి..Telangana elections: 32 + 87 = 119… జనసేన, టీడీపీ పొత్తు లెక్క ఇదే..!
తెలంగాణలో 87 స్థానాల్లో పోటీ చేస్తామంటోంది టీడీపీ. అటు ఇప్పటికే 32 మంది అభ్యర్థులతో లిస్ట్ ప్రకటించింది జనసేన. జనసేన సీట్ల జోలికి వెళ్లకుండా టీడీపీ జాబితా ఉండే అవకాశం ఉంది. చంద్రబాబు ఆమోదం కోసం ఇరు పార్టీ నేతల వెయిట్ చేస్తున్నట్టు సమాచారం.

Translate this News:











