ఎన్నికల టైమ్ దగ్గరపడుతోంది. ఓవైపు రాజకీయ పార్టీలు ప్రచారాల్లో మునిగితేలుతున్నాయి, మాటాల తూటాలు సంధిస్తున్నాయి. మరోవైపు సర్వేలు వాటి పని అవి చేసుకుపోతున్నాయి. నియోజకవర్గాల్లో తిరుగుతూ సర్వేలు చేస్తున్నాయి. ఎవరు గెలుస్తారో లెక్కలు కడుతున్నాయి. ఆత్మసాక్షి, రాజనీతి సర్వేలు బీఆర్ఎస్కు పట్టం కట్టగా.. తాజాగా రిలీజైన ‘పోల్ ట్రాకర్ సర్వే(Poll Tracker Survey)’ హస్తానిదే హవా అంటోంది. తెలంగాణలో ఎన్నికల విజేత కాంగ్రెసేనని చెబుతోంది.
పూర్తిగా చదవండి..TS Elections 2023: హస్తానిదే హవా..? పోల్ ట్రాకర్ సర్వే ఫలితాలు ఇవే..!
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని 'పోల్ ట్రాకర్' సర్వే చెబుతోంది. మొత్తం 119 నియోజకవర్గాల్లో హస్తం పార్టీకి 64 నుంచి 71 వరకు ఓట్లు వస్తాయని.. అటు బీఆర్ఎస్కు 39-43 సీట్లు వస్తాయని సర్వే రిజల్ట్ చెబుతోంది. 28 రోజుల పాటు జరిగిన ఈ సర్వేలో 1,54,851 మంది అభిప్రాయాలను తెలుసుకుంది.

Translate this News:












