MODI tour Telangana: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ఢిల్లీ పెద్దల ఫొకస్ ఎక్కువగా రాష్ట్రంపైనే ఉంది. వరుస పెట్టి ఒకరి తర్వాత ఒకరు తెలంగాణలోకి అడుగుపెడుతున్నారు. ర్యాలీలు, సభల్లో పాల్గొంటున్నారు. కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు. కాంగ్రెస్, బీజేపీ ఈ రెండు జాతీయ పార్టీల పెద్దలు ఇప్పటికి చాలాసార్లు తెలంగాణలోని బహిరంగ సభలకు వచ్చారు. కాంగ్రెస్ నుంచి సోనియా, రాహుల్, ప్రియాంక లాంటి టాప్ లీడర్లు ఇప్పటికే కార్యకర్తల్లో కొత్త ఉత్సహం నింపగా.. బీజేపీ నుంచి అమిత్షా లాంటి బడా నేతలు కమల సపోర్టర్స్ని ఉత్తేజపరిచారు. ఇప్పుడు ప్రధాని మోదీ వంతు వచ్చింది. తెలంగాణకు అక్టోబర్లో మోదీ రానున్నారని తెలుస్తోంది.
పూర్తిగా చదవండి..Modi To telangana: తెలంగాణకి ప్రధాని మోదీ.. ఎప్పుడంటే?
ఢిల్లీ పెద్దలు వరుసగా తెలంగాణ బాట పడుతున్నారు. రెండు జాతీయ పార్టీల(కాంగ్రెస్, బీజేపీ)కు చెందిన టాప్ లీడర్లు వరుస పెట్టి తెలంగాణకు వస్తున్నారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు టైమ్ దగ్గర పడుతుండడంతో బడా నేతల చూపు తెలంగాణపై పడింది. అక్టోబర్ మొదటి వారంలో తెలంగాణకు ప్రధాని మోదీ రానున్నారు. నిజామాబాద్లో మోదీ రోడ్ షో ఉండే అవకాశముంది.

Translate this News:











