Ponguleti Srinivas Reddy: మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy) మెడకు పొత్తుల కత్తి వేలాడుతోంది. కామ్రేడ్లతో కాంగ్రెస్ పొత్తు ఖరారు అవ్వడంతో పొంగులేటికి షాక్ తగిలినట్టు అయ్యింది. వామపక్షాలకు పొంగులేటి అనుచరుల సీట్లు ధారాదత్తం చేసినట్టు సమాచారం. సీపీఐ (CPI) కు కొత్తగూడెం, చెన్నూరుతో పాటు సీపీఎం (CPM)కు మిర్యాలగూడ సీట్లు ఇస్తున్నట్టు తెలుస్తోంది. వైరా స్థానంపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. మరోవైపు తన అనుచరుల సీట్లు కోసం పొంగులేటి పట్టుబడుతుండగా.. అది కుదరదని అధిష్టానం తేల్చేసింది.
ఏం చేయాలి?
కమ్యూనిస్టులకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీట్లు కేటాయిస్తుండడంతో పొంగులేటి (Ponguleti) అనుచరులు డైలమాలో ఉండిపోయారు. కొత్తగూడెం కాంగ్రెస్ అభ్యర్థిత్వాన్ని పొంగులేటి అనుచరుడు ఊకంటి గోపాలరావు ఆశించారు. అటు వైరా కాంగ్రెస్ అభ్యర్థిత్వాన్ని విజయాభాయ్ ఆశించారు. చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థిత్వాన్ని డాక్టర్ రాజా రమేశ్ ఆశించగా.. మిర్యాలగూడ అభ్యర్థిత్వాన్ని లక్ష్మారెడ్డి ఆశించారు. ఇప్పుడు వీరికి సీటు దక్కుతుందో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. ఇక కామ్రేడ్లతో పొత్తుపై రేపు(అక్టోబర్ 22) అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
Telangana Elections 2023: పొంగులేటి మెడకు పొత్తుల కత్తి.. ఆ సీట్లు కమ్యూనిస్టులకు!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులో భాగంగా సీట్ల పంపకం కోసం వామపక్షాలు, కాంగ్రెస్‌ల మధ్య చర్చలు ఓ కొలిక్కివచ్చినట్టే కనిపిస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో పలు స్థానాలను కమ్యూనిస్టులకు ఇవ్వాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించినట్టు సమాచారం. పొంగులేటి అనుచరులు ఆశిస్తున్న సీట్లు ఇందులో ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం కోసం పైన ఉన్న హెడ్డింగ్‌ను క్లిక్ చేయండి.

Translate this News:











