ఎన్నికలకు ముందు బీఆర్ఎస్కు బిగ్ షాక్‌లు తగులుతున్నాయి. సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు బీఆర్ఎస్కు గుడ్‌బై చెప్పారు. వేనేపల్లితో పాటు ముగ్గురు ఎంపీపీలు,ముగ్గురు జడ్పీటీసీలు కారు దిగారు. పలువురు ఎంపీటీసీలు, సర్పంచుల మూకుమ్మడిగా రాజీనామా చేశారు. బొల్లం మల్లయ్య యాదవ్ ఓటమే లక్ష్యంగా పని చేస్తామని శపథం చేశారు. రేపు ఉత్తమ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లో జాయిన్ అవుతామని ప్రకటించారు. ఎమ్మెల్యే నిరంకుశంగా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు. సొంత పార్టీ నాయకులపైనే ఎమ్మెల్యే కేసులు పెట్టించడం దారుణమన్నారు. అదిష్టానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. కాంగ్రెస్ గెలుపు కోసం అందరం కలిసి పనిచేస్తామని తెలిపారు.
పూర్తిగా చదవండి..BREAKING: బీఆర్ఎస్కు భారీ షాక్.. ఇద్దరు కీలక నేతలు ఔట్!
సూర్యాపేట జిల్లా కోదాడ బీఆర్ఎస్కు భారీ షాక్ తగిలింది. పలువురు కీలక నేతలు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. కోదాడ మాజీ ఎమ్మెల్యే చందర్రావు బీఆర్ఎస్ రాజీనామా చేశారు. ఆయనతో పాటు ముగ్గురు MPPలు, ముగ్గురు ZPTC సభ్యులు, సీనియర్ నాయకులు ఎర్నేని వెంకట రత్నం బాబు, మాజీ డీసీసీబీ చైర్మన్ పాండురంగారావు, మహబూబ్ జానీ, ఎంపిటిసిలు, సర్పంచులు మూకుమ్మడి రాజీనామా చేశారు.

Translate this News:












