బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాల్లో 7 తీర్మానాలను ఆమోదించారు. రాజకీయ తీర్మానంలో కుటుంబ పాలన ప్రజస్వామ్యానికి ప్రమాదకరమని బీజేపీ(BJP) పేర్కొంది. మీడియాలో ప్రభుత్వ సొమ్ముతో రెచ్చగొట్టే ప్రకటనలు చేయడాన్ని ఖండిస్తూ రాజకీయ తీర్మానం చేసింది బీజేపీ. కేసీఆర్ పాలన అవినీతిమయమని.. ఇచ్చిన హామీలు అమలులో వైఫల్యం చెందారని ఆరోపిస్తూ బీజేపీ తీర్మానించింది. కొలువులు ఇవ్వకుండా యువత విరోధిగా కేసీఆర్ మారారని బీజేపీ రాజకీయ తీర్మానంలో చెప్పింది. అటు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పూర్తి స్థాయిలో ఇవ్వకుండా పేదలను మోసం చేస్తున్నారనీ ఆరోపిస్తూ రాజకీయ తీర్మానం చేసింది.
పూర్తిగా చదవండి..BJP Resolutions: పసుపు బోర్డు, ట్రైబల్ యూనివర్శిటీ.. బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ ఏడు తీర్మానాలు ఇవే!
మహిళా రిజర్వేషన్లు, పసుపు బోర్డు, ట్రైబల్ యూనివర్శిటీ, జీ-20 సమ్మిట్ సఫలం, చంద్రయాన్-3 విజయం, కృష్ణ బోర్డ్ ట్రిబ్యునల్, రాజకీయ తీర్మానం.. ఈ ఏడు తీర్మానాలను బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాల్లో ఆమోదించారు. మహిళా రిజర్వేషన్ పై ధన్యవాద తీర్మానాన్ని డికె అరుణ పెట్టగా.. టర్మరిక్ బోర్డ్ ఏర్పాటుపై అరవింద్, రాజకీయ తీర్మానాని బండి సంజయ్, ట్రైబల్ యూనివర్శిటీ మంజూరుపై ధన్యవాద తీర్మానాన్ని సొయం బాపూరావు ప్రవేశపెట్టారు.

Translate this News:











