Telangana Elections 2023: తెలంగాణలో ఎన్నికల సందడి మొదలైంది. ఇవాళ మధ్యాహ్నం ఎన్నికల కమిషన్ నామినేషన్లు, పోలింగ్, కౌంటింగ్ తేదీలను ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీల అభ్యర్థులెవరు? అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే 119 నియోజకవర్గాల్లో ఐదు స్థానాల్లో మినహా అభ్యర్థులను ఖరారు చేసింది. వారంతా ఇప్పటికే తమ నియోజకవర్గాల్లో ప్రచారం మొదలుపెట్టారు. అయితే కొన్నిచోట్ల అభ్యర్థులకు అసమ్మతి సెగ తగులుతుండడం, మరికొన్ని చోట్ల అభ్యర్థులు నచ్చక కిందిస్థాయి నేతలు రాజీనామాలు చేస్తూ వేరొక పార్టీల్లోకి వెళుతున్నారు. ఈ నేపథ్యంలో కొందరు అభ్యర్థులను మారుస్తారనే ప్రచారమూ జగుతోంది. బీఆర్ఎస్ పరిస్థితి ఇలా వుంటే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఇంత వరకూ ఒక్క అభ్యర్థిని కూడా ప్రకటించలేదు. అభ్యర్థుల ఎంపికపై ఇంకా చర్చలు, సమావేశాలు జరుగుతూనే వున్నాయి.
పూర్తిగా చదవండి..Telangana Elections 2023: విడుదలైన షెడ్యూల్.. ఏ పార్టీ అభ్యర్థులెవరు? ప్రధాన పార్టీల్లో అయోమయం

Translate this News:











