కరీంనగర్లో మంగళవారం మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఇచ్చిన బి ఫామ్ మాకు పవిత్ర గ్రంథంతో సమానమని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. 2018 ఎన్నికల్లో తనను ఓడించేందుకు కుట్రలు పన్నారని ఈటెల చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఈటెలది దుర్మార్గాపు ఆలోచన అని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన బిఫామ్ మాకు పవిత్ర గ్రంథంతో సమానమని.. కేసీఆర్ ఫోటోతో గెలిచి… ఏళ్ళ తరబడి పదవులు అనుభవించిన ఈటెల రాజేందర్ ఇప్పుడు కేసీఆర్పై ఆరోపణలు చేస్తున్నారని మంత్రి గంగుల దుయ్యపట్టారు. రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ ఫోటో లేకుండా గెలువగలవా..? అని ఈటెలను గంగుల ప్రశ్నించారు. ఉద్యమాలకు పెట్టింది పేరు ఈ గడ్డ అని, స్వరాష్ట్ర సాధన కోసం సింహ గర్జనతో సమరశంఖాన్ని పూరించింది ఇక్కడి నుండేనని మంత్రి అన్నారు.
పూర్తిగా చదవండి..Telangana Election: బీ ఫామ్ మాకు పవిత్ర గ్రంథం.. ఈటల ఆ ఆలోచన మానుకోవాలి: మంత్రి గంగుల
చారిత్రక నగరం కరీంనగర్ అని మంత్రి గంగుల అన్నారు. ఉద్యమాలకు పెట్టింది పేరు ఈ గడ్డ.. స్వరాష్ట్ర సాధన కోసం సింహ గర్జనతో సమరశంఖాన్ని పూరించింది ఇక్కడి నుండే అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కరీంనగర్ జిల్లాలో నిర్మించారని అన్నారు. ఎన్నింటికో వేదికగా నిలిచిన ఘనత కరీంనగర్ది అన్నారు.

Translate this News:











