తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి మొదలయ్యిందనే చెప్పాలి. ఇక్కడి అధికార బీఆర్ఎస్ పార్టీ తన పార్టీ అభ్యర్ధలు జాబితాను విడుదల చేసేయడంతో కాంగ్రెస్, బీజెపీలు సైతం క్యాండిడేట్ల లిస్ట్ మీద కసరత్తులు ప్రారంభించాయి. ఇందులో భాగంగానే ఈరోజు ఢిల్లీలో ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ అయింది. ఈ కమిటీ సమావేశంలో ఛైర్మన్ మురళీధరన్, సభ్యులు జిగ్నేష్ మేవానీ, సిద్ధిఖి, ఎక్స్ అఫిషియో సభ్యులుగా రాష్ట్ర ఇంచార్జి మాణిక్ రావ్ ఠాక్రే, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డిలు పాల్గొన్నారు. 35 నియోజకవర్గాలకు ఒక్కొక్కరే దరఖాస్తు చేయడంతో వారినే ఫైనల్ చేయాలని స్క్రీనింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. లిస్టులో ఉన్న అభ్యర్థులనే ఫైనల్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర ఎన్నికల కమిటీకి ఫైనల్ చేసిన లిస్టును పంపి…ఈ నెలాఖరులోగా ఫస్ట్ లిస్ట్ విడుదల చేసే ఛాన్స్ ఉందని సమాచారం.
పూర్తిగా చదవండి..Telangana Congress First List: తెలంగాణ కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ ఇదే…
తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్ధుల మొదటి లిస్ట్ తయారైంది. ఈరోజు ఢిల్లీలో జరిగిన స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో ఈ లిస్ట్ మీద చర్చించారని తెలుస్తోంది. 35 నియోజకవర్గాల్లో ఒక్కో అభ్యర్ధి మాత్రమే దరఖాస్తు చేసుకోవడంతో వారినే ఫైనల్ చేయాలని కమిటీ నిర్ణయం తీసుకుంది.

Translate this News:











