Telangana Elections: కాంగ్రెస్ను గెలిపిస్తే సింగరేణి సమస్యలన్నీ పరిష్కరిస్తామన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy). సింగరేణి లేకుంటే తెలంగాణ ఉద్యమమే లేదన్నారు. అలాంటి కార్మికులను ఇవాళ కేసీఆర్(CM KCR) నట్టేట ముంచారని విమర్శించారు. సింగరేణిని(Singareni) నాశనం చేసే గనుల ప్రైవెటైజేషన్ బిల్లుకు కేసీఆర్, ఆయన కూతురు కవిత మద్దతు తెలిపింది నిజం కాదా అని ప్రశ్నించారు. సంస్థ బాగుపడాలంటే మంచి యాజమాన్యం, మంచి ప్రభుత్వం ఉండాలన్నారు. సింగరేణి ఎన్నికలు జరగాలంటే డిసెంబర్ 3న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలన్నారు రేవంత్రెడ్డి. గురువారం నాడు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని 1వ గనిలో గేట్ మీటింగ్లో పాల్గొన్నారు టీపిసిసి అద్యక్షులు రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, మధు యాష్కీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గండ్ర సత్యనారాయణ రావు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన కాంగ్రెస్ నేతలు.. రాష్ట్రాన్ని నాశనం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీని గద్దె దించాలని, ప్రజలంతా కాంగ్రెస్కు ఓటు వేయాలని కోరారు.
పూర్తిగా చదవండి..Telangana Elections: సింగరేణి విషయంలో అది నిజం కాదా? సీఎం కేసీఆర్పై రేవంత్ సంచలన కామెంట్స్..
సింగరేని సంస్థ బాగుపడాలంటే మంచి యాజమాన్యం, మంచి ప్రభుత్వం ఉండాలన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. సింగరేణి ఎన్నికలు జరగాలంటే డిసెంబర్ 3న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. సింగరేణి సమస్యలన్నీ పరిష్కరిస్తామన్నారు. గురువారం నాడు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని 1వ గనిలో గేట్ మీటింగ్లో పాల్గొన్న టీపిసిసి అద్యక్షుడు రేవంత్ రెడ్డి ఈ కామెంట్స్ చేశారు.

Translate this News:











