ముందు అనుకున్న విధంగా కాంగ్రెస్ అభ్యర్థుల తొలిజాబితా మరికొన్ని గంటల్లో విడుదల కానుంది. ఢిల్లీలో సమావేశమైన కాంగ్రెస్ నేతలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. జాబితా ఆలస్యం కావటంపై నేతలపై రాహుల్ సీరియస్ అయ్యారు. ఈ వ్యవహారాన్ని త్వరగా తేల్చాలంటూ కేసీవేణుగోపాల్ కు ఆదేశాలు జారీ చేశారు. దాంతో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి, స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ మురళీధరన్ తోపాటు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జిగ్నేష్ మేవాని తదితరులు పాల్గొన్నారు. 58 మందితో తొలిజాబితాను ఖరారు చేశారు. మరో రెండు రోజుల్లో మిగిలిన పేర్లను ప్రకటిస్తామని స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ మురళీధర్ వెల్లడించారు. గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నవారికి, పార్టీకి విధేయులుగా ఉన్న నేతలను అభ్యర్థులుగా ఎంపిక చేశామని తెలిపారు. అన్ని సామాజిక వర్గాలకు సీట్ల కేటాయింపు ఉంటుందని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Kishan Reddy: కాంగ్రెస్ ఆఖరికి ఆవు పేడను కూడా వదలదు.. పొన్నాల లక్ష్మయ్య పెనంలోంచి పొయ్యిలో: కిషన్ రెడ్డి
TS Congress: మరికొన్ని గంటల్లో కాంగ్రెస్ జాబితా.. 58 మందితో ఫస్ట్ లిస్ట్?
రేపు మేనిఫెస్టో విడుదల చేయాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిద్ధం అవుతున్న వేళ.. 58 మందితో ఫస్ట్ లిస్ట్ విడుదల చేయడానికి సిద్ధం అవుతోంది కాంగ్రెస్. మరికొన్ని గంటల్లోనే కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ విడుదల కానుంది. రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితర ప్రముఖ సీట్లు ఈ జాబితాలో ఉండనున్నాయి.

Translate this News:











